Header Banner

మద్యం కుంభకోణంలో కీలక మలుపు.. కోర్టు తీర్పుతో మిథున్ రెడ్డికి షాక్! నోటీసులతో దూకుడు పెంచిన సిట్!

  Fri Apr 18, 2025 12:47        Politics

జగన్‌ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మరింత పెంచింది. కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్‌ కసిరెడ్డి) కోసం విస్తృతంగా గాలిస్తూనే.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. శుక్రవారం (18న) విచారణకు రావాలంటూ వారిద్దరికీ మూడ్రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. అయితే ఒక రోజు ముందే.. గురువారమే వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి కోసం సిట్‌ చీఫ్‌ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర అధికారులు విజయవాడ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో మధ్యాహ్నం వరకూ ఎదురు చూశారు. చివరి నిమిషంలో ఆయన నుంచి ఓ సందేశం వచ్చింది. ఇతరత్రా ముఖ్యమైన పనులు ఉండడం వల్ల రాలేకపోతున్నానని, శుక్రవారం తప్పకుండా హాజరవుతానన్నది దాని సారాంశం. ఇంకోవైపు.. శుక్రవారం రావలసిన మిథున్‌రెడ్డి సిట్‌ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణను ఆడియో-వీడియో రికార్డింగ్‌ చేయాలని కోరారు. ఇందుకు కోర్టు నిరాకరించడంతో ఆయన సిట్‌ ముందు హాజరవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో శనివారం (19న) విచారణకు రావాలని సిట్‌ అధికారులు ఆయనకు మరో నోటీసిచ్చారు.

కాగా.. మద్యం కుంభకోణంలో కసిరెడ్డిదే కీలక పాత్ర అని విజయసాయిరెడ్డి గత విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను ఏ విచారణకు పిలిపించినా ఇదే విషయాన్ని చెబుతానని నాడు స్పష్టం చేశారు. అయితే ఎన్ని నోటీసులిచ్చినా రాకుండా కసిరెడ్డి పరారీలో ఉండడంతో.. సిట్‌ బృందం హైదరాబాద్‌ వెళ్లి ఆయన తండ్రి ఉపేందర్‌రెడ్డికి రెండ్రోజుల కిందట నోటీసిచ్చింది. దీంతో ఆయన గురువారం విజయవాడలో సిట్‌ కార్యాలయానికి వచ్చారు. రాజ్‌ ఎక్కడకు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లారు.. ఎక్కడ ఉండే అవకాశం ఉంది.. ఎక్కువగా ఎక్కడకు వెళ్తుంటారరు.. ఎవరితో బాగా దగ్గరగా ఉంటారు.. వంటి ప్రశ్నలను సిట్‌ అధికారులు సంధించారు. అన్నిటికీ తనకేమీ తెలియదనే ఉపేందర్‌రెడ్డి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దరిమిలా శుక్రవారం మరోమారు విచారణకు రావాలని సిట్‌ అధికారులు సూచించడంతో.. విజయవాడలోనే ఉంటానంటూ తాను బస చేసే హోటల్‌ వివరాలు చెప్పి వెళ్లినట్లు సమాచారం. ఇంకోవైపు... గత ప్రభుత్వంలో ముడుపులు చెల్లించిన మద్యం వ్యాపారులకు వరుసగా నోటీసులిచ్చిన సిట్‌.. శుక్ర, శనివారాల్లో పలువురిని ప్రశ్నించనుంది.


ఇది కూడా చదవండివైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LiquorScam #MithunReddy #SITInvestigation #CourtVerdict #PoliticalScam